Wednesday, November 01, 2006

ఎందుకు?

నిస్పృహ అని ఎందుకు పెట్టాను? ఏమో మరి. ఈ మధ్య కొన్ని బ్లాగ్ లను చూసాను. చాలా బాగున్నాయి. ముఖ్యంగా తెలుగు బ్లాగ్లు చాలా బాగున్నాయి, మన ఆలొచనలు రాయటానికి. నాకు కూడ అలా ఒక చోట ప్రచురించాలని అనిపించింది. ఆది తెలుగు లొ ఐతే ఇంకా బాగుంది.

మరి నిస్పృహ అని ఎందుకు పెట్టాను? సర్లేండి చెపుతాను. నా అభిప్రాయము మనము నిస్పృహలో ఉన్నపుడు మాత్రమే నిజమైన మన మనస్సులొ మాటని చెపుతాము. మనము స్పృహలో ఉన్నప్పుడు మన అభిప్రాయలను పూర్టిగా చెప్పము. ఎందుకంటే దాని వలన ఇతరులకు కోపము రావచ్చు. నిజం ఎవరికి కావాలి చెప్పండి. ఇంక స్పృహ లేకుండ అవితే మనకు అసలు ఏమీ తెలియదు. అప్పుడు అభిప్రాయానికి విలువ లేదు. ఇంక మనకు భాథ కల్గినపుడు, నిజం వస్తుంది. మరియు పూర్తిగా అణగతొక్కపడినపుడు కలిగేది - నిస్పృహ. నాకు నిస్పృహ అంటే భయము, గౌరవము.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home